NTV Telugu Site icon

Bandi Sanjay: 4 స్ధానాల నుంచి 8కి వచ్చాం.. త్వరలో 8 పక్కన 8 చేర్చి 88 చేస్తాం..!

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: తెలంగాణలో 88 సీట్లు సాధించి మోడీ పాలన తీసుకొస్తాం అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికాయి బీజేపీ శ్రేణులు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ పాలన మొత్తం దేశం అంతా వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. తెలంగాణ లో 88 సీట్లు సాధించి మోడీ పాలన తీసుకొస్తాం అన్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక తప్పుడు ప్రచారాలు చేసిందని మండిపడ్డారు.. రామమందిరంపై కూడా తప్పుడు మాటలు ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు..

Read Also: Odisha: స్టేజీపై నవీన్ పట్నాయక్-మోడీ సంభాషణ.. ఆసక్తిగా చూసిన నేతలు

అయితే, ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేసామని ప్రజలు ఫీల్ అవుతున్నారని తెలిపారు బండి సంజయ్‌.. తెలంగాణలో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారన్న ఆయన.. 4 స్ధానాల నుంచీ 8 స్ధానాలకు వచ్చాం.. త్వరలో 8 పక్కన 8 చేర్చి 88 చేస్తాం అన్నారు.. మా తప్పులు బేరీజు వేసుకుని సరైన పరిష్కారం దిశగా అడుగులేస్తాం అన్నారు.. మా గెలుపోటములు పై మేం సమీక్షించుకుంటాం అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌. కాగా, నిన్న విజయవాడ చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. ఈ రోజు ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్, నారా లోకేష్‌ సహా 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరైన విషయం విదితమే.. ఇక, ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఏపీ బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు బండి సంజయ్‌.