Bandi Sanjay : హకీం పేట్ లోని నిసా కేంద్రంలో రోజ్ గార్ మేళా లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. 340 మందికి నియామక పత్రాలను బండి సంజయ్ అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ యువత సాధికారత లక్ష్యంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అంకితభావం, పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన వారికి అభినందనలు తెలిపారు బండి సంజయ్. అంతేకాకుండా.. సీఐఎఎస్, బిఎస్ఎఫ్, ఐటీవీపీ, ఐఐటీ లలో ఉద్యోగాలు రావడం సంతోషమన్నారు. ప్రధాని మోడీ కి ఇష్టమైన కార్యక్రమం రోజ్ గర్ మేళా అని ఆయన వ్యాఖ్యానించారు.
Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం బంగారం ధర ఎంతుందంటే?
ఇప్పటికీ 8 లక్షల 50 వేల మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చామని, 10 లక్షల మందికి ఉద్యోగాలు అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు. కేంద్రప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలు అందరికీ చెచుకోవాలనేదే మా ఆకాంక్ష అని, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని శాఖలకు చెందిన ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చాము.ప్రపంచంలో భారత దేశం 3 వ ఆర్థిక శక్తి గా ఎదిగిందన్నారు. దళారీలు,కోర్టు కేసులు,పేపర్ లీకేజీలు లేకుండా పారదర్శకత తో ఉద్యోగ నియామకాలు చేపట్టింది కేవలం మోడీ సర్కారే అని, స్టార్ట్ అప్ ఇండియా లతో మోడీ ఉద్యోగ కల్పన చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. పేరు కోసం మాటలు చెప్పే వారిని,ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. డిజిటల్ యుగాన్ని తీసుకువచ్చి దేశ స్థితి గతులను మార్చారు..వ్యవసాయ రంగంలో ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామన్నారు బండి సంజయ్.
Uppal Fly Over: ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పునఃప్రారంభం