Bandi Sanjay : హకీం పేట్ లోని నిసా కేంద్రంలో రోజ్ గార్ మేళా లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. 340 మందికి నియామక పత్రాలను బండి సంజయ్ అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ యువత సాధికారత లక్ష్యంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అంకితభావం, పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.…
ఈ నెల 8న ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఖాజా మాన్షన్, మాసబ్ ట్యాంక్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 40కి పైగా కంపెనీలు మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నాయి. ఫ్రెషర్లు మరియు అనుభవం ఉన్నవారు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులకు వారి విద్యార్హత ప్రకారం తగిన ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెండు సెట్ల…