Bandi Sanjay Kumar: ఆగస్ట్ లో రైతు రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ బోగస్ మాటలు చెబుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. జూన్ లో రుణమాఫీ చేయాలని 5700కోట్ల రూపాయలు లేని ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ప్రజలను తిరిగి మోసం చేయాలని చూస్తోందన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేవని.. రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
మళ్ళీ దళారి వ్యవస్థ నడుస్తోందని పేర్కొన్నారు. నామినేషన్లు మొదలు అయిన ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించారు. కరీంనగర్ లో బీఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రంలో17 స్థానాలు గెలిచినట్టేనన్నారు. ఇప్పుడు కరీంనగర్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పై ఒక్క కేస్ కూడా లేదని.. ప్రజల కోసం పోరాటం చేసిన సంజయ్ పై కేసులున్నాయన్నారు.
READ MORE: Raghunandhan Rao: రేవంత్ రెడ్డికి తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు.. ఆయన మాటల్లో నిజాల్లేవ్..
కేసీఆర్ కుటుంబ సభ్యులకి ఓడిపోతే పదవులు ఇవ్వలేదా? అవి పునారావాస కేంద్రాలా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతానంటే తాము ప్రోత్సహించ లేదని.. బీజేపీలోకి ఎవ్వరు వచ్చినా.. రాజీనామా చేసి రావాల్సిందే నన్నారు. బీఆర్‌ఎస్ పార్లమెంటు ఎన్నికలలో మూడవస్థానానికి పరిమితమవుతుందన్నారు. కారు గుర్తు మీద పోటీ చెయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ తోనే… వార్ వన్ సైడ్.. దేశంలో బీజేపీదే హవా చెప్పారు. కరీంనగర్ లో నన్ను ఓడగొట్టడానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకటయ్యారని ఆరోపించారు. నామినేషన్ లు ప్రారంభం అయిన కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకడం లేదని దుయ్యబట్టారు. గత పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదని.. బీజేపీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ కి లేదన్నారు.