Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌పై ఎంపీ, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దరఖాస్తు చేసుకోకపోయినా పరీక్షలకు అనుమతిస్తారా కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. దరఖాస్తు చేయకుండా మెడికల్ కాలేజీలెట్లా మంజూరు చేస్తారో చెప్పు అంటూ ప్రశ్నలు గుప్పించారు. దరఖాస్తు చేసుకున్న రాష్ట్రాలన్నింటికీ మెడికల్ కాలేజీలొచ్చాయని.. మోడీని నిందించే పాలకులున్న తమిళనాడుకు 11, బెంగాల్‌కు 7 కాలేజీలొచ్చాయన్నారు. బీజేపీకి పేరొస్తుందని అప్లై చేయకుండా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నష్టం చేశారన్నారు. స్మార్ట్ సిటీ నిధులిచ్చింది కేంద్రమే.. తెచ్చింది నేనే… చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. గంగుల ఇచ్చే ఫోన్లపై మోడీ పొటోను డీపీలుగా పెట్టుకోవాలన్నారు.
Also Read: Nallala Odelu: బాల్క సుమన్ రూ. 20 కోట్లు ఆఫర్ చేసిండు: నల్లాల ఓదేలు
భూకబ్జాదారులైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులను ఓడించాలని ఆయన అన్నారు. కబ్జాకోర్ల తోక కట్ చేయాలంటే బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. సుభాష్ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్.. దేశానికి 157 కాలేజీలు ఇచ్చిన ప్రధాని మోదీ, తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకియ్యలేదని కేసీఆర్ చెప్పడం సిగ్గు చేటన్నారు. మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోని కేసీఆర్‌కు వాటి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాలేజీలను ఎట్లా మంజూరు చేస్తారంటూ ప్రశ్నించారు. బీజేపీని నిత్యం తిట్టే పాలక పార్టీలున్న తమిళనాడుకు 11, బెంగాల్‌కు 7 మెడికల్ కాలేజీలు మంజూరైన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Also Read: Vijayashanti: కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి
కేంద్ర ప్రభుత్వం మూడు దశల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని బండి సంజయ్ చెప్పారు. మూడో దశలో దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిందని.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు కాలేజీల కోసం దరఖాస్తు చేసుకున్నాయని.. అన్ని రాష్ట్రాలకూ కాలేజీలు వచ్చాయన్నారు. నిత్యం మోడీని తిట్టే పశ్చిమ బెంగాల్‌కు 7 కాలేజీలు వచ్చినయి. బీజేపీ అధికారంలో లేని తమిళనాడుకు 11 వచ్చినయి. తెలంగాణకు కూడా ఇస్తాం డీపీఆర్‌లు (డీటైల్‌డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) పంపండని కేంద్ర ఆరోగ్యశాఖ ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర సర్కార్ పంపలేదన్నారు. ఇవాళ కేసీఆర్ వచ్చి వినోద్ రావు గురించి మాట్లాడుతున్నడు. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకరా? లేక వినోద్ రావా? వినోద్ రావు స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చినట్లు చెబుతున్నడు… సవాల్ చేస్తున్నా…. స్మార్ట్ సిటీ నిధులిచ్చింది కేంద్రమే అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.