మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్ లకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు .. వారు ఏమన్నా బిచ్చం ఎత్తుకుంటున్నరా అంటూ ఆయన మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులను బీజేపీపై రెచ్చగొట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కంలకు బకాయిలు చెల్లించు….జీతాలు ఇవ్వలేని పరిస్థితి… మోడీ వల్ల ఈ రోజు మిగులు విద్యుత్ దేశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి విద్యుత్ కొనడం లేదా కేసీఆర్ స్పష్టం చేయాలి.
నీ పార్టీ ఎంతా… నక్కకు నాగా లోకం కి ఉన్న తేడా టీఆర్‌ఎస్, బీజేపీకి. నీ మాట నీ కార్యకర్తలు కూడా వినడం లేదు… కేసీఆర్ పెద్ద కుట్రదారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరో,సర్దార్ పటేల్ పేరో పెట్టు. తెలంగాణ భవన్ లో అంబేడ్కర్ పోటో ని తీసి కెసిఆర్ పోటో పెట్టుకున్నాడు..దళితున్ని సీఎం చెయ్యి ముందు… అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించింది కేసీఆర్ అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. అయితే.. ప్రస్తుతం బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర నాల్గవ విడత పాదయాత్ర చేస్తున్నారు.
