Site icon NTV Telugu

Bandi Sanjay : మేం అభ్యర్థుల లిస్ట్‌ ఢిల్లీ పంపితే.. కాంగ్రెస్‌ లిస్ట్‌ ప్రగతి భవన్‌కు పోయింది

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు, ఎంపీ లక్ష్మణ్‌ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ల సమక్షం లో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇతర పార్టీ లలో డబ్బులు ఇచ్చి కండువాలు కప్పుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ప్రధాని మాట్లాడిన తర్వాత వాస్తవ విషయాన్ని ప్రజలు గుర్తించారు… బీజేపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. మంచి అభ్యర్థులను కిషన్ రెడ్డి నాయకత్వం లో ఎంపిక చేసి ఢిల్లీకి పంపామని, కానీ కాంగ్రెస్ లిస్ట్ ప్రగతి భవన్ కి వెళ్ళిందని ఆయన విమర్శించారు.

Also Read : D K Shivakumar: బీజేపీ, జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో 40 మంది.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..

రేవంత్ రెడ్డి కి తెలియట్లేదు… కేసీఆర్‌ 30 మందికి పైసలు పంపారు.. తెరవెనుక ఏమీ జరుగుతుందో అయన తెలుసుకోవడం లేదన్నారు. బలి కా బకరా లుగా మిగిలేది ఇద్దరే ఒకరు రేవంత్ రెడ్డి, ఇంకొకరు హరీష్ రావు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ లో కొట్లాట జరుగుతుంది.. కేటీఆర్ , హరీష్‌ ల మధ్య లొల్లి నడుస్తుందన్నారు బండి సంజయ్‌. కేటీఆర్ మొఖం చూడ్డానికి ఎవరు రావడం లేదని బండి సంజయ్‌ అన్నారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మొదటి సారిగా అధికారుల పై వేటు వేసిందన్నారు. ఇంకా పిచ్చి వేషాలు వేయిద్దని వేటు తప్పదని అధికారులకు హెచ్చరిస్తున్నారని, కేసీఆర్‌కి తొత్తులుగా వ్యవహరించ వద్దని అధికారులకు చెబుతున్నానన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులో 30 కోట్ల నుండి వంద కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు కేసీఆర్‌ రెడీ అయ్యారని ఈటల వ్యాఖ్యానించారు.

Also Read : Jawan: రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా.. ఓటిటీలోకి వచ్చేస్తుంది..?

Exit mobile version