Site icon NTV Telugu

Bandi Sanjay : రాష్ట్రంలో ఉద్యోగాల కోసం కన్నీటి ఎదురు చూపులే

Bandi Sanjay

Bandi Sanjay

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. ట్విటర్ వేదికగా బండి సంజయ్ విమర్శలకు దిగారు. “ఏండ్లుగా కొలువుల పంచాయితి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల నుంచి ఈనాడు స్వరాష్ట్రంలో నయా నిజాం వరకు ద్రోహమే. ఉద్యోగాల కోసం కన్నీటి ఎదురు చూపులే. దగాపడ్డ నిరుద్యోగుల రణ నినాదమే ‘సాలు దొర నీకు సెలవు దొర” అని ఓ వీడియోను షేర్ చేస్తూ ట్విట్టస్త్రాలు సంధించారు. ఇదిలా ఉంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బ అనిల్ నిన్న జమ్మూకాశ్మీర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు.

Also Read : Revanth Reddy: లక్ష్మణ్, కిషన్ రెడ్డి రండి.. మా మెట్లపై కూర్చొని చదువుదాం

జవాన్ అనిల్ మృతి పట్ల బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు యత్నించారు బండి సంజయ్. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడిన ఆయన.. అనిల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని ఆదేశించారు. అంతిమ సంస్కార ఏర్పాట్లతోపాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు.

Also Read : Minister Karumuri Nageswara Rao: చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం..

Exit mobile version