పరేడ్‌తో కూడిన గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాల్సిందేనంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంపై, న్యాయ స్థానాలపై కేసీఆర్ కు గౌరవం ఉంటే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. అంతేకాకుండా.. పరేడ్ గ్రౌండ్ లోనే గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థను గౌరవించాలని, రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా రాజ్యాంగ ద్రోహిగా, ప్రజాస్వామ్య ద్రోహిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతారని తెలంగాణ శాఖ పక్షాన హెచ్చరిస్తున్నామన్నారు.
Also Read : Pathaan: బాలీవుడ్ పతనాన్ని ‘పఠాన్’ ఆపినట్టేనా..?
అయితే.. పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించకూడదంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మాధవి సారథ్యంలోని ధర్మాసనం కొద్దిసేపటి కిందటే ఆదేశాలు వెలువడించింది. తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకూడదంటూ ఇదివరకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది. 2022లో కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
Also Read : Padi Kaushik Reddy : హుజురాబాద్ అభివృద్ది కోసం ఈటల రాజేందర్ తట్టెడు మట్టి పోయలేదు