NTV Telugu Site icon

Bandi Sanjay : బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించడం సిగ్గుచేటు

Bandi Sanjay

Bandi Sanjay

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించి బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించారు. అనంతరం కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ సర్వేను ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభను రేపటికి (ఫిబ్రవరి 1వ తేదీ)కి వాయిదా వేశారు. అయితే.. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌, ఎంపీ బండి సంజయ్‌ పార్లమెంట్‌ అవరణలో మాట్లాడుతూ… బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Also Read : Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి.. వాతలు పెట్టిన ఆమె తల్లి

రాష్ట్రపతి రాజకీయ నాయకురాలు కాదు, రాష్ట్రపతి ప్రసంగం విన్న తర్వాత ఎవరు కూడా బహిష్కరించారన్నారు. రాష్టప్రతి ప్రసంగం ధన్యవాదా తీర్మానం సమయంలో బీఆర్‌ఎస్‌ చెప్పొచ్చున్నారు. మోడీ అనేక సందర్భంలో చెప్పారు, పార్లమెంట్‌లో మంచి వాతావరణం కల్పిద్దామని, కేసీఆర్‌కి ద్వేషం మహిళలంటే, ఆదివాసులు, మైనారిటీ అంటే కేసీఆర్‌కు ద్వేషమని ఆయన విమర్శించారు. మొదటి ప్రభుత్వంలో మహిళ నేత లేదు, మహిళ కమిషన్ లేదని, మహిళ గవర్నర్‌ను అవమానిస్తారని ఆయన ధ్వజమెత్తారు. హైకోర్టులో కేసీఆర్‌ కేసు ఎందుకు వేశారో, తెలియక జనాలు నవ్వుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read : Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి.. వాతలు పెట్టిన ఆమె తల్లి

కేసీఆర్‌ను ముంచడానికి సలహాలు ఇస్తున్నారని, అది తెలంగాణకు మంచిదేనన్నారు. మహిళలు అంటే ముఖ్యమంత్రికి ద్వేషమని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు, దళితులు అంటే ద్వేషమని, బీఆర్ఎస్ ఎంపీలు సంచలనం కొరకు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Rishabh Pant: రిషభ్ పంత్ హెల్త్ అప్‌డేట్..ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ, ఎస్సీ సమాజానికి, మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వర్గాలు కేసీఆర్‌ని క్షమించరన్నారు. గవర్నర్ అంటే మర్యాద లేదని, వాస్తవాలు మాట్లాడితే గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలంటారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తుందని, రాష్ట్రపతి ప్రసంగాలు బహిష్కరించారు కారణం చెప్పడం లేదని, కేసీఆర్ కుటుంబానికి కండకావరం ఎక్కువైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తుంటే బీజేపీ ప్రతినిధులు అరెస్టు చేస్తున్నారని, ఏబీవీ కార్యకర్తలను అరెస్టు చేశారు.. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్ గుండాలు దాడులు చేశారని ఆరోపించారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారని బండి సంజయ్‌ విమర్శించారు.