Rishabh Pant: రిషభ్ పంత్ హెల్త్ అప్‌డేట్..ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు యాక్సిడెంట్‌కు గురై ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్. గతేడాది డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా, పంత్‌కు సంబంధించిన హెల్త్ అప్‌డేట్ నేడు(జనవరి 31) విడుదలైంది. పంత్ మోకాలి సర్జరీ సక్సెస్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. అలాగే ఆస్పత్రి వర్గాలు మరో శుభవార్త కూడా చెప్పాయి. పంత్ వేగంగా కోలుకుంటున్నాడని, ఈ వారంలోనే అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వారు వెల్లడించారు. మార్చిలో పంత్‌కు మరో విడత మోకాలి సర్జరీ జరుగుతుందని, పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 8-9 నెలల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి కూడా ధృవీకరించారు.
Payyavula Keshav: విశాఖ రాజధాని.. సీఎం ప్రకటన వెనుక అనేక కారణాలు..
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
పంత్ ప్రస్తుతం కోలుకునే దశలోనే ఉండటంతో ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నీలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్, ఆ తర్వాత జరిగే ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లను పంత్ దూరం కానున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో ఉండగా.. ఆసీస్ టెస్ట్ సిరీస్‌లో మాత్రం పంత్ లేని లోటు టీమిండియాపై పెను ప్రభావం చూపనుంది.
INDvsAUS Test: ఇండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్‌కు షాక్.. స్టార్ పేసర్‌కు గాయం
కాగా, ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2022లో రిషభ్ పంత్‌కు చోటు దక్కింది. గతేడాది టెస్టుల్లో అద్భుత పెర్ఫామెన్స్ చేసిన టీమిండియా వికెట్ కీపర్ పంత్‌కు మాత్రమే టెస్టు టీమ్‌లో చోటిచ్చారు. ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్న పంత్.. నిరుడు 12 ఇన్నింగ్స్‌ల్లో 90.09 యావరేజ్‌తో 680 రన్స్ చేసి సత్తాచాటాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే కీపర్‌గా 23 క్యాచ్‌లు అందుకున్నాడు.
తాజావార్తలు
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!