Site icon NTV Telugu

Bandi Sanjay : అకాల వానలతో రైతులు ఏడుస్తుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు డిస్కో డ్యాన్సులు చేస్తారా?

Bandi Sanjay On Amit Shah

Bandi Sanjay On Amit Shah

కేసీఆర్ అతీక్ అహ్మద్ ను మించిన గ్యాంగ్ స్టర్ అని ఆరోపించారు బండి సంజయ్‌. పోలీసులను అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నడని మండిపడ్డారు బండి సంజయ్‌. అకాల వానలతో రైతులు ఏడుస్తుంటే…మంత్రులు, ఎమ్మెల్యేలు డిస్కో డ్యాన్సులు చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నల్లపోచమ్మ గుడికి రెండున్నర గుంటల జాగా మాత్రమే ఇస్తారా? -మసీదుకు మాత్రం 5 గుంటల జాగా ఇస్తారా? -కేసీఆర్ కుటుంబానికి నెయ్యి… నిరుద్యోగులకు గొయ్యి.. రైతుల బతుకులను నుయ్యిలా మారుస్తారా? నిరుద్యోగుల పక్షాన ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా? నేను పేపర్ లీక్ చేస్తే మీరేం పీకుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Silk Smitha: సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే

కేసీఆర్ కు డౌన్ ఫాల్ స్టార్టయ్యిందన్నారు. నాకు జైలు కొత్తకాదు… కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిందే… నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందేనన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం… ఉచిత విద్య, వైద్యం అందిస్తామని పాలమూరు ‘‘నిరుద్యోగ మార్చ్’’లో బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Also Read : Silk Smitha: సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే

Exit mobile version