NTV Telugu Site icon

Bandi Sanjay : తాత్కాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారితే అది బతుకే కాదు

Bandi Sanjay

Bandi Sanjay

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో 500 మంది యువకులు చేరారు. బాణా సంచా పేల్చి జై బీజేపీ అంటూ బండి సంజయ్ ను ఆహ్వానిస్తూ ర్యాలీ నిర్వహించిన యువత.. యువకులందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారితే అది బతుకే కాదన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి రాజకీయాలు ఉంటాయి పోతాయని, కానీ వ్యక్తిత్వం ముఖ్యమన్నారు బండి సంజయ్‌. తెలంగాణ లో రోజు గారి యోజన పథకం కింద చాలా మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంట్లో మాత్రం నలుగురికి ఉద్యోగాలు వచ్చాయన్నారు బండి సంజయ్‌.

అంతేకాకుండా.. ‘ఇంటికో ఉద్యోగం అని చెప్పి మాట మార్చారు. ముఖ్యమంత్రి ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ అంటాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఎవరి బాధ్యత. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్టం మొత్తని సర్వ నాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రతి ఒక్కరి పై అప్పు ఉంది. ప్రధానమంత్రి ఇచ్చే నిధులు దారి మల్లుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వెంటిలేటర్ పై ఉంది. బీఆర్ఎస్ పార్టీ లో లుక లుక లు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ ను ప్రకటించడానికి సీఎం కేసీఆర్ సిద్ధం అయ్యాడు. కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు. మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి పేరు మార్చారు.’ అని బండి సంజయ్‌ అన్నారు.