NTV Telugu Site icon

Bandi Sanjay: మహిళల మానప్రాణాలకంటే ఫర్నీచర్ ముఖ్యమా?

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: ‘‘ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నం చేస్తే మహిళల మాన, ప్రాణాలకంటే ఒకవర్గం వాళ్ల ఫర్నీచర్, షాపులే ముఖ్యమైనట్లుగా మాట్లాడుతూ రాక్షసంగా వ్యవహరించడం సిగ్గు చేటు’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిగిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడులను అరికట్టాలనే నెపంతో హిందూ యువతపై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గాంధీ ఆసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జైనూర్ ఆదివాసీ మహిళను కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు బీజేపీ నేతలతో కలిసి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళ ముఖం గుర్తుపట్టలేనంతగా దాడికి గురవడం చూసి సంజయ్ నిశ్చేష్టులయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Read Also: Khammam: రేపు ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల పర్యటన

ఆమె ఆరోగ్య పరిస్థితి బాధాకరమని, ఆమె మొహంపై తీవ్ర గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారని బండి సంజయ్ తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించకుండా.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జైనూరులో ముస్లిం దుకాణాలు దగ్ధమయ్యాయని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మహిళల మానప్రాణాలకంటే ఫర్నీచర్ ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. బాధితురాలికి సత్వర న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. జైనూరులో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను ప్రభుత్వం అదుపు చేయాలని పేర్కొన్నారు. జైనూరులో జరుగుతున్న గొడవలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పోలీసులు పక్షపాత వైఖరి విడనాడాలని.. ఇప్పటికీ అనేక ఘటనలు జరిగినప్పటికీ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆదివాసీ మహిళా పై జరిగిన దాడికి సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. చెరువు ఆక్రమణల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. మంత్రి సీతక్క బాధితురాలిపై అత్యాచారం జరగలేదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు

Show comments