Site icon NTV Telugu

Bandi Sanjay : కేసీఆర్, ఆయన కుటుంబం నిజాం, రాజ కుటుంబం అనుకుంటోంది

Bandi Sanjay Formers

Bandi Sanjay Formers

మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోని బీజేపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్, ఆయన కుటుంబం తనకు తానుగా నిజాం రాజ కుటుంబం అనుకుంటోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ మెప్పు కోసం బీజేపీ కార్యకర్తలను హింసిస్తారా? అని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. కొందరు పోలీసులు బీఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మేము అడ్డుకోవాలంటే ఆపడం మీ తరం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసిన కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో లక్ష 90 వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయట్లేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

Also Read : TarakaRatna Health Bulletin: విషమంగానే ఆరోగ్యం.. తారకరత్న తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, సర్పంచుల నిధులన్నీ కేసీఆర్ దోచుకున్నాడని బండి ఆరోపణలు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని సంజయ్ ఫైరయ్యారు. బీఆర్ఎస్ నేతల్లాగా తమ ఎంపీ అర్వింద్ లిక్కర్ దందాలకు పాల్పడలేదని, పత్తాలాట ఆడలేదని ఘాటు విమర్శలు చేశారు. బడ్జెట్ అనుమతికి ఇంకా సమయం ఉందని, అనుమతి ఇవ్వడంలేదని కావాలనే గవర్నర్‌పై లేనిపోని ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. గవర్నర్ విషయంలో హైకోర్టు చెంప చెళ్లుమన్పించినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదని బండి సంజమ విమర్శలు చేశారు.

Also Read : YS Jagan Delhi tour: సీఎం జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. విమానంలో సాంకేతిక లోపంతో మారిన ఢిల్లీ షెడ్యూల్‌..

Exit mobile version