హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలే రద్దు చేశారని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. మహిళా గవర్నర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని గుర్తుచేశారు. కనీసం గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ కూడా పాటించలేదని.. అంతేకాకుండా అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదని మండిపడ్డారు.
Karumuri Nageswara Rao: వైసీపీ’సిద్ధం’ సభ వాయిదా
రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన బీఆర్ఎస్‌ను.. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఛీ అంటూ తిరస్కరిస్తున్నారన్నారు. ఇంత జరిగినా వాళ్ల అహంకారం మాత్రం తగ్గలేదని.. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లోనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో మాత్రం బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఛీదరించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
Boyapati Next: బోయపాటితో అల్లు అరవింద్.. మాస్ కాంబో వచ్చేస్తోంది!
గవర్నర్ అంటే రబ్బర్ స్టాంపులా ఉండాలని బీఆర్‌ఎస్ అనుకుందని… రాజ్యాంగానికి లోబడి పనిచేసే వాళ్లు బీఆర్ఎస్‌కు పనికిరారని ఫైరయ్యారు. అంతేకాకుండా రాజ్యాంగాన్నే మార్చాలంటూ అంబేద్కర్‌ను అవమానించారన్నారు. అత్యున్నత ప్రజాస్వామిక దేశం ఏదంటే ఠక్కున ఇండియా పేరే చెబుతారంటే.. మన రాజ్యాంగం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాలు తమ తమ రాజ్యాంగాలను మార్చుకున్నాయని.. కానీ భారత్ మాత్రం రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించినా.. మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చలేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్‌ది మూడో స్థానమేనని జోస్యం చెప్పారు. ఇంకా గూండా గిరి చేస్తాం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు బీఆర్ఎస్ నేతలపై తిరుగుబాటు చేస్తారని బండి సంజయ్ హెచ్చరించారు.