NTV Telugu Site icon

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Badi

Badi

కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎలక్షన్ ప్రసారం నిర్వహించారు. వాకర్స్ క్రీడాకారులను కలిసి తమకు ఓటు వేయాలంటూ క్రికెట్, వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకు బర్బాస్ చేసిన కేసీఆర్.. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏం చేయకున్నా మేధావిగా చెప్పుకుంటున్నారు.. మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు.. పంట నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తానని మాట తప్పారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రైతులు నష్టపోతే ఆదుకొని కేసీఆర్ పంజాబ్ కు వెళ్లి అక్కడి రైతులకు ఐదు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశాడు.. యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఆయనే కోర్టులో కేసు వేసి ఉద్యోగాలు రాకుండా చేసింది కేసీఆర్.. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం దోచుకోవడం కోసమే ఐదు లక్షల కోట్ల అప్పు చేసింది అని బండి సంజయ్ ఆరోపించారు.

Read Also: Weather Update: హీట్ వేవ్‌ నుంచి ఉపశమనం.. మే 5 నుంచి 9 వరకు ఈ రాష్ట్రాల్లో వర్షాలు

కాగా, ఇప్పుడు మళ్లీ కొత్త కథ మొదలు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ మంచోడే అని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. మంచోడు అయితే ఐదు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారో చెప్పాలన్నారు. కరీంనగర్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ల్యాండ్ కబ్జాలకు పాల్పడితే ఆ పార్టీ నాయకుడిగా ఎందుకు స్పందించలే.. తెలంగాణ రాష్ట్ర డబ్బులు లిక్కర్ మాఫియాలో ఢిల్లీకి తీసుక పోయి పెట్టేందుకు కేసీఆర్ కుటుంబం ప్రయత్నించిందన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీపై కూడా బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను ఇప్పటి వరకు చెల్లించదని విమర్శించారు.

Read Also: Samyuktha Menon : మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న కేరళ బ్యూటీ..?

ఢిల్లీకి పైసలు పంపించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉపయోగపడుతుంది అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఖర్చు పెట్టే పైసలు ఫోన్ టాపింగ్ లో దోషిగా అమెరికాలో ఉన్న వ్యక్తి పైసలే అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒక్కొక్క అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేసి పైసలు పంచె ప్రయత్నం చేస్తున్నారు.. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాలి.. కాంగ్రెస్, టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడి మరి పైసలు పంచుతున్నాయన్నారు. ప్రజలు గమనించి ఇలాంటి నాయకులకు అవకాశం ఇవ్వకుండా తమకు ఓటేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.