మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలకు ఈ భామ మొదటి ఛాయిస్ గా మారింది.ప్రస్తుతం ఈ భామ లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శర్వానంద్ మరియు నిఖిల్ లాంటి యంగ్ హీరోల సినిమాలలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో ఈ భామ హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.
గత ఏడాది ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీనితో కాస్త బ్రేక్ తీసుకొని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. లుధీర్ బైరెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రూ. 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం .