కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నార బండి సంజయ్. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బండి సంజయ్ మాట్లాడుతూ.. నాణ్యతలేని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రారంభానికి ముందే కూలిపోతున్నాయని ఆయన అరోపించారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు మొండి చేయి చూపించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. రైతు. పేదల ద్రోహి బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఆర్టీసీ చార్జీలు, ఆస్తి పన్ను, భూమి పన్నులు పెంచుతూ గ్యాస్ ధర పెరిగిందని బీఆర్ఎస్ ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసుల పాలు కాకుండా బిడ్డను కాపాడుకోవడం కోసం పడరానీ పాట్లు పడుతున్నారు కేసీఆర్ అని ఆయన విమర్శించారు.
Also Read : Arvind Kejriwal : మోడీజీ సిగ్గు పడండి.. ప్రధానిపై కేజ్రీవాల్ నిప్పులు
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా వినపడుతున్న 3 సుమస్యలు.. డబుల్ బెడ్ రూమ్, ధరణిపోర్టల్, రుణ మాఫీ అని ఆయన మండిపడ్డారు. రాత్రి 1 గంట తర్వాతనే ధరణి పోర్టల్ తెరుచుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్యం అమ్మకాలపైనే ఆధారపడిందన్నారు. కేసీఆర్ కుమార్తె కూడా మద్యం వ్యాపారంపైనే ఆధారపడిందని ఆయన విమర్శించారు. లిక్కర్ స్కామ్ నుండి తన కుమార్తెను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ గురించి మాట్లాడుతున్నాడని, లిక్కర్ స్కామ్ చార్జిషీట్ లో కవిత పేరు నాలుగు సార్లు వచ్చిందన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కి భయపడదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు కూడా ఫోర్జరీ సంతకాలు పెట్టిన చరిత్ర కేసీఆర్‌ది ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.