Site icon NTV Telugu

Bandi Sanjay : కేసీఆర్ లా దొంగ మాటలు నేను మాట్లాడలేను

Bandi Sanjay

Bandi Sanjay

కరీంనగర్ జిల్లాలోని ఇళ్ళంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఆనతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ కార్యకర్తలు, నాయకులు కష్ట పడి పని చేయడం వల్లె తనకు మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ఇల్లంతకుంట దేవస్థానం నుండి ప్రచారం ప్రారంభించానని, తనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కిందన్నారు. అందుకోసం మళ్ళీ ఈ దేవస్థానంలో స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఇల్లంతకుంట దేవస్థానం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాని బండి సంజయ్‌ వెల్లడించారు. కేసీఆర్ లా దొంగ మాటలు నేను మాట్లాడలేనని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’బీఆరెఎస్ పార్టీ తెలంగాణ పేరు చెప్పి ఏ విధంగా దోపిడీ చేసిందో చూశాం. తెలంగాణ కేబినెట్ మీటింగ్ నడుస్తుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేబినేట్ లో చర్చించండి. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఇంకా ఇప్పటి వరకు హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏదో ఒకటి, రెండు చిన్న హామీలు ఇచ్చి దాటెద్దామనుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఆక్రోశం, ఆవేశంతో ఉన్నారు. వారి ఆగ్రహ ఆవేశాలకు లోను కాక ముందే హామీలు అమలు చేయండి. ఒక చెంచు మహిళా పట్ల కొందరు ఫాల్త్ గాళ్ళు ఏ విధంగా చేశారో చూశాం. నిర్భయ కన్న దారుణమైన సంఘటన జరిగింది. బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ అవే సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ లో ఎవరు ఐతే గుండాయిజం చేసిర్రో.. ఇప్పుడు వారినే కాంగ్రెస్ నాయకులు కుడి బుజాలుగా పెట్టుకుంటున్నారు. పాలకులు ఆలాంటి వారికి భయం అంటే ఎట్లా ఉంటాదో చూపించాలి. ఇటువంటి క్రిమినల్స్ కు సపోర్ట్ చేసే వారిపై ముందుగా కేసు పెట్టాలి. బీఆర్ ఎస్ ప్రభుత్వానికి ఎజెంట్ గా ఉన్న అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలకు పాల్పడాలంటే భయపడే విధంగా చేయాలి.’ అని బండి సంజయ్‌ అన్నారు.

Exit mobile version