మహేశ్వరం నియోజకవర్గం అమీర్ పేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ఫైర్… గ్రామాల అభివ్రుద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కరానికి నిధులివ్వాలని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండి పడ్డారు. ‘‘రాష్ట్రంలోని పంచాయతీల అభివ్రుద్ధికి నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే. మీ లెక్క (బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి) నరేంద్రమోదీ బీజేపీలోనే చేరితేనే పంచాయతీలకు నిధులిస్తామని చెబితే… బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా?’’అంటూ ప్రశ్నించారు. మహేశ్వరం మండలం అమీర్ పేటలో బుధవారం రాత్రి పొద్దుపోయాక నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, మండలాధ్యక్షులు మాధవాచారి, సర్పంచ్ శ్రీశైలం, నందీశ్వర్, యాదీశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే….
Also Read : Death Penalty: క్షుద్ర విద్యలొస్తాయని అనుమానంతో కుటుంబం హత్య.. ఐదుగురికి మరణదండన
బీఆర్ఎస్ పార్టీ ముంచిన ఫైనాన్స్ కొత్త దుకాణమే. బీఆర్ఎస్ కు కార్యవర్గమే లేదు. ఇతర రాష్ట్రాల నుండి బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులంతా చెల్లని కాసులు. మునుగోడు ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో బూత్ కు ఒక్కో ఎమ్మెల్యే, మంత్రిని నియమించిన టీఆర్ఎస్ కు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ చాలు. బీజేపీ దెబ్బకు కేసీఆర్ నిద్ర పట్టక రాత్రింబవళ్లు తాగుతున్నడు. నిత్యం ఎట్లా ప్రజల నుండి దండుకోవాలనే తపనే తప్ప ఇండ్లు కట్టివ్వాలనే ఆలోచనే కేసీఆర్ కు లేదు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టానికే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మీటింగులు పెట్టి బీజేపీ దమ్మేందో చూపిస్తున్నాం. మహేశ్వరంలో టీఆర్ఎస్ నేతల భూ కబ్జాలకు అంతు లేకుండా పోయింది. ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 2.4 లక్షల ఇండ్లకు నిధులిస్తే… కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టకుండా నిధులను దారి మళ్లించింది. ఇంటికో ఉద్యోగమిస్తానని… అప్పటిదాకా ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తానని మాట కేసీఆర్ ను నిలదీయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వని కేసీఆర్ తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలిచ్చుకున్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే 2.46 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి అపాయిట్ మెంట్ లెటర్లు ఇస్తే… ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని దుర్మార్గుడు కేసీఆర్.’ అని బండి సంజయ్ మండిపడ్డారు.
Also Read : Sir Pre Release Event: ‘సార్’ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన మాటల మాంత్రికుడు
