Site icon NTV Telugu

Bandi Sanjay : బీఆర్‌ఎస్‌ నేతలను ఉరికిచ్చే దమ్ము ఉన్న పార్టీ బీజేపీ

Bandi Sanjay T Govt

Bandi Sanjay T Govt

మోడీ సభ జన సమీకరణపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలు, కార్పొరేటర్‌లతో ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రంను బద్నాం చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు అని ఆయన వ్యాఖ్యానించారు. తిరిగి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడం లేదని ఆయన అన్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని, కేటీఆర్ అయ్యను చర్చకు రమ్మను అంటూ.. బండి సంజయ్‌ సవాల్ చేశారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, పెన్షన్‌లు నాలుగు పథకాలు ఇచ్చి ఎంతో చేస్తున్న అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Krishna Dist Assault Case: కృష్ణా జిల్లాలో దారుణం.. అత్యాచారం చేసి, ఆపై హత్య

అంతేకాకుండా.. ‘ఊళ్లలో రొడ్లులేవు… జీతాలు ఇవ్వలేని వాడు అభివృద్ధి ఎలా చేస్తారు.. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి… కార్పొరేటర్ లు కష్టబడి పని చేయాలి… అహంకారం తో ఉండొద్దు చెడ్డ పేరు రావొద్దు. పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది.. మోడీ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి…. ఎన్నికల యుద్ధం స్టార్ట్ అయింది .. ఎన్నికలు ఎప్పుడు అయిన రావొచ్చు.. బెంగాల్ లెక్క ఇక్కడ చేయాలి అంటే బీజేపీ కార్యకర్తలు భయపడరు ఊరికిచ్చి కొడతారు. బీఆర్‌ఎస్‌ నేతలను ఉరికిచ్చే దమ్ము ఉన్న పార్టీ బీజేపీ.. హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఉపేక్షించేది లేదు… స్పందించక పోతే బీజేపీ కార్యకర్తలము కాదు.. గ్రేటర్‌లో బీజేపీకి అందుకోసమే ఓటు వేశారు.’ అని ఆయన అన్నారు.

Exit mobile version