తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు పదోన్నతి లభించింది. బీజేపీ అధిష్టానం ఆయనకు కీలక పదవిని కట్టబెట్టింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమిస్తూ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఏపీ బీజేపీ నేత సత్య కుమార్ కు జాతీయ కార్య దర్శిగా ఛాన్స్ ఇస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన పదవిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించడం లేదా జాతీయ కార్యదర్శిగా నియమించి కొన్ని రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా పంపడం ద్వారా కేంద్ర నాయకత్వం బండి సంజయ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
Also Read : Governor Convoy: గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు అరెస్ట్
కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఒకరికి ఒకే పదవి.. ఆయన రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్ కు అవకాశం కల్పిస్తారనే ప్రచారం సాగింది. అయితే తాజాగా బండి సంజయ్‌ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది బీజేపీ అధిష్టానం..
Also Read : Cinematography Bill: సినిమా చూస్తూ స్టేటస్ పెట్టడానికి వీడియో తీస్తున్నారా? దొరికితే మైండ్ బ్లాకయ్యే శిక్ష?
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నాలాంటి సామాన్య కార్యకర్తకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ స్థాయికి ఎదగడానికి, ఏ బాధ్యతలో ఉన్న నేర్చుకోవడానికి నన్ను ప్రోత్సహిస్తున్న కార్యకర్తలకు నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న కరీంనగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు బండి సంజయ్. అత్యంత అంకితభావంతో, నేను నా పార్టీకి ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని, జై శ్రీ రామ్ భారత్ మాతాకు జై అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
