Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay About Hindu Temple Attacks

Bandi Sanjay : ఆలయాలపై దాడులు చేసే వారందరిపై పిచ్చోళ్లుగా ముద్ర వేస్తరా..?

Published Date :November 8, 2024 , 6:01 pm
By Gogikar Sai Krishna
  • కాంగ్రెస్ కు హిందువులు ఓట్లేయలేదా?
  • ఏడాదిలో వందకుపైగా ఆలయాలను ధ్వంసం చేసినా పట్టించుకోరా?. హిందువులకంటే ఒక వర్గం ఓట్లే కాంగ్రెస్ కు ఎక్కువా? : బండి సంజయ్‌
Bandi Sanjay : ఆలయాలపై దాడులు చేసే వారందరిపై పిచ్చోళ్లుగా ముద్ర వేస్తరా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay : కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పిచ్చోళ్లుగా ముద్రవేసి వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం హిందూ దేవాలయాలు, హిందువులపై మాత్రమే పిచ్చోళ్లు దాడులు చేస్తరా? ఇతర ప్రార్ధన మందిరాల జోలికి వెళ్లరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఓట్లేయలేదనుకుంటున్నారా? ఒక వర్గం ఓట్ల కోసం దేవాలయాలపై, హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఇకపై ఆలయాలపై దాడులు చేస్తే కఠిన చర్యలుంటాయని సీఎం హెచ్చరికలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హిందువులంతా ఏకమై ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.

ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్టు కాలనీకి వచ్చిన బండి సంజయ్ కుమార్ స్థానిక బీజేపీ నేతలతో కలిసి హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం నవగ్రహాల ధ్వంసంపై ఆరా తీశారు. అనంతరం బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధి జె. సంగప్పతోపాటు స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు… ఏమన్నారంటే…

కాంగ్రెస్ పాలనలో హిందువులకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది. ఏడాదిలో వరుసగా ఆలయాలపై దాడులే నిదర్శనం. భాగ్యనగరంలోని సంతోష్ నగర్ రక్షాపురంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేస్తే చర్యల్లేవ్… గోషామహల్ నియోజకవర్గంలో దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చర్యల్లేవ్… మాసబ్ ట్యాంక్ వద్ద దుర్గామాత విగ్రహం ఎదుట గోవు మాంసం పడేసి అపవిత్రం చేస్తే చర్యల్లేవ్.. అంబర్ పేట లో మహంకాళి అమ్మవారి విగ్రహం ధ్వంసం చేస్తే చర్యల్లేవ్.. పంజాగుట్టలో పోచమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చర్యల్లేవ్.. సికింద్రాబాద్ కుమ్మరి వాడలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చర్యల్లేవ్… ఇక్కడ శంషాబాద్ హనుమాన్ టెంపుల్ లో నవగ్రహాలను ధ్వంసం చేస్తే చర్యల్లేవ్. ఇగ రాష్ట్రవ్యాప్తంగా హిందువులపై దాడులు చేస్తే చర్యలు అసలే లేవు…

ఇగ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై జరుగుతున్న దాడులకు లెక్కేలేదు….శామీర్ పేట తూంకుంట లో వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పట్టించుకోరు. మేడ్చల్ లో రాముల వారి విగ్రహాన్ని కూల్చేస్తే చర్యల్లేవ్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవత మూర్తి విగ్రహాలను అధికారులు కూల్చేసి హిందువులపై దాడి చేస్తే పట్టించుకోరు. మెదక్ జిల్లా రాయలపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహాన్ని బావిలో పడేస్తే చర్యల్లేవ్. సిద్దిపేట జిల్లా వర్గల్ లో పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చర్యల్లేవ్.. దుండిగల్ లో అమ్మవారి విగ్రహం, బొల్లారంలోని బొంతపల్లి లో హనుమాన్ విగ్రహం, మక్తల్ పట్టణంలో గణేష్ విగ్రహాలను, వికారాబాద్ జిల్లా కోటిపల్లి లో నవగ్రహాలను, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాలను ధ్వంసం చేశారు. నిజామాబాద్ జిల్లా దోస్ కల్ లో అమ్మవారి విగ్రహాలను, మహేశ్వరం నియోజకవర్గంలోని గట్టుపల్లిలో హనుమంతుడి ఆలయాన్ని ధ్వంసం చేస్తే అసలే చర్యల్లేవ్.. ఇట్లా చెప్పుకుంటూ కాంగ్రెస్ 10 నెలల పాలనలో వందకుపైగా ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులపై దాడులు చేశారు…

నేనడుగుతున్నా….దేవాలయాలపై దాడులు చేసేటోళ్లను పిచ్చోళ్లని ముద్ర వేసి వదిలేస్తారా? పిచ్చోళ్లకు హిందూ దేవాలయాలపైనే దాడులు చేస్తారా? ఇతర ప్రార్ధనా మందిరాల జోలికి వెళ్లరా? లవ్ జిహాద్, జిహాద్, ఆలయాల ధ్వంసం పేరుతో హిందువులపై దాడులు జరుగుతున్నయ్. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. ఇది మంచి పద్దతి కాదు.. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే మీరు చర్యలు తీసుకోరా?… మేం మాట్లాడితే దాడులు చేస్తరా? తమకు తాము రక్షించుకోవడానికి హిందువులంతా రక్షక దళాలు ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి పరిస్థితి వచ్చింది. రోడ్డుపైకి ఎక్కి ఆందోళన చేసే స్థాయికి వచ్చారు. కాంగ్రెసోళ్లకు హిందువులు ఓట్లేయలేదా? వాళ్ల పక్షాన మాట్లాడాల్సిన అవసరం లేదా? ఒక వర్గం ఓట్ల కోసం హిందువులపై దాడులు చేస్తున్నా, ఆలయాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోరా?పరిస్థితి ఇట్లనే ఉంటే హిందువులు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే పరిస్థితి వచ్చింది… అది రాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నా…

ఇయాళ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు… ఆయన నిండు నూరేళ్లు ఆయురోరాగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా హిందూ దేవాలయాల జోలికి పోతే కఠినాతికఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా… అదే సమయంలో హిందువులందరికీ విజ్ఝప్తి చేస్తున్నా… ఈ దాడులను ఇంకా భరిద్దామా? తెలంగాణలో హిందువుల పరిస్థితి ఏ విధంగా తయారైందో ఆలోచించండి. దేవాలయాలు ధ్వంసమైతే బిచ్చమేస్తాం… చూసుకోండని ప్రభుత్వం భావిస్తోంది. మీరు వేసే బిచ్చంతో ఆలయాలను నడిపే పరిస్థితి హిందువులకు ఉందనుకుంటున్నారా? మీరు ఇట్లనే ఉంటే మేం కూడా ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొంటాం. ఏం చేయాలో అది చేస్తాం. అంత వరకు పరిస్థితి తీసుకురానీయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నా. రోహింగ్యాలకు షెల్టర్ ఇచ్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులే. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనే ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.’ అని బండి సంజయ్‌ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • Bandi Sanjay Statement
  • bjp
  • bjp telangana
  • congress

తాజావార్తలు

  • Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

  • Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions