Site icon NTV Telugu

Bandi Sanjay : కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay

Bandi Sanjay

హిందూ మతం గురించి మాట్లాడే బండి సంజయ్ కు రాజకీయాలెందుకని, మఠం పెట్టుకుంటే చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘24 గంటలు తాగి పండే మీ అయ్యకు సీఎం పదవెందుకు? బార్ పెట్టుకుంటే చాలదా? నిత్యం మసీదులు, ముస్లింలని మాట్లాడే నీకు రాజకీయాలెందుకు మసీదు ఏర్పాటు చేసుకుంటే సరిపోదా?’’ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు కండకావరమెక్కి మాట్లాడుతున్నారని, అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. ఈరోజు సాయంత్రం ఉప్పల్ ఆర్వోబీని పరిశీలించేందుకు వచ్చిన బండి సంజయ్ ను కేటీఆర్, వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. ఆయనేమన్నారంటే…

కేటీఆర్ కు కండకావరం తలకెక్కింది. నేను హిందూ ధర్మం కోసం మాట్లాడితే మఠం పెట్టుకోవాలట… సిగ్గు లేకుండా మాట్లాడుతున్నడు… మీ అయ్య 24 గంటలు తాగి పండుకుంటున్నడు కదా… మీ అయ్యకు సీఎం పదవి ఎందుకు? బార్ పెట్టుకుంటే సరిపోతుంది కదా? నువ్వు మాట్లాడితే ముస్లింల గురించి మాట్లాడుతున్నవ్ కదా.. హిందూ ధర్మమంటే నీకు గిట్టదు కదా.. మసీదు పెట్టుకో.. నీకు రాజకీయాలెందుకు? రాష్ట్రంలో 99 శాతం మంది దేవుడిని నమ్మేవాళ్లున్నారు. నేనడుగుతున్న. కేటీఆర్ దేవుడిని నమ్మని నాస్తికుడు… దేవుడిని నమ్మేవాళ్లు నాస్తికుడి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికే యాదగిరిగుట్టను నిర్మించామని చెప్పిన మూర్ఖుడు కేటీఆర్. ఇకనైనా తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం. మీ అరాచకాలను, అహంకారంపై పోరాడి తరిమి కొట్టింది బీజేపీయే. కారు సర్వీసింగ్ కు పోయిందట… తాగి కారు నడిపే మీ అయ్యలాంటోళ్ల వల్లే కారు షెడ్డుకు పోయింది. రిపేర్ కు కూడా పనికిరాకుండా పోయింది. పాత సామానోళ్లు కూడా ఆ డొక్కు కారును కొనే పరిస్థితి లేదు.

కేటీఆర్ కు దమ్ముంటే బీఆర్ఎస్ పాలనలో ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారో చెప్పాలి. మేం రాబోయే ఎన్నికల్లో మోదీ చేసిన అభివ్రుద్ధి, ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారనే వివరాలను పూర్తి స్థాయిల్ ప్రజల్లోకి తీసుకెళతాం… ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే…రాసి పెట్టుకోండి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నాన్ లోకల్. ఆయన ఏనాడూ కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేదు. ఏనాడూ ప్రజలను కలవలేదు. ఎన్నికలొస్తున్నాయని తెలిసి డ్రామాలాడుతున్నడు.. ఆయన మాటలను ఎవరూ పట్టించుకోరు.’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Exit mobile version