Bandi Sanjay : కూలీ పనులు చేసే దుస్థితి సర్పంచులది.. ఇదే ప్రజాస్వామ్యమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్‌లో సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు.. నూతన పంచాయతీ భవనాలు ప్రారంభించుకోకుండా సర్క్కులర్ ఇవ్వడమా? అని అన్నారు ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూలీ పనులు చేసే దుస్థితి సర్పంచులది…ఇదే ప్రజాస్వామ్యమా? అని ఆయన ప్రశ్నించారు. నేను సీఎంకు లేఖ రాసినా స్పందన లేదన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ మాదిరిగానే జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తోందని, చేసిన పనులకు బిల్లులివ్వరు… కనీసం రికార్డుల్లోకి ఎక్కివ్వరని ఆయన మండిపడ్డారు. ఇట్లయితే సర్పంచులుగా పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని, కాంగ్రెస్ నుండి సర్పంచుగా పోటీ చేయరని, తక్షణమే పెండింగ్ బిల్లలున్నీ మంజూరు చేయండన్నారు బండి సంజయ్. నూతన భవనాలను ప్రారంభించుకునే అవకాశం ఇవ్వండని, విపక్షాల నిర్మాణాత్మక సూచనలు పరిగణలోకి తీసుకోండన్నారు. లేనిపక్షంలో మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారని, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలోని స్వయంభూ శ్రీ మల్లిఖార్జున స్వామిని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు వేద ఆశీర్వచనలు అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన బండి సంజయ్‌కు మైలారం గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు.
Also Read
- Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
-
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
-
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!