Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Bhagirath: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఓ యువతిపై లైంగిక దాడి కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌కు మల్కాజ్గిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా భగీరథ్ జైలు జీవితం అనుభవిస్తున్నాడు. తాజాగా ఇంజనీరింగ్ పరీక్షల నేపథ్యంలో న్యాయవాదులు మధ్యంతర బెయిల్ కోరారు. వాదనల విన్న కోర్టు నెల 26 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. గత నెలలో భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భగీరథ్ మే 17న ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. ఇక, నిందితుడిని పేట్‌బషీరాబాద్ పోలీసులు గతంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మేడ్చల్ మేజిస్ట్రేట్ అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకుముందు రెండు గంటలకుపైగా సిట్ అధికారులు అతడిని విచారించారు. అప్పటి నుంచి నెల రోజులకు పైగా జైలు జీవితం గడిపిన భగీరథ్ తాజాగా బెయిల్‌పై బయటకు రానున్నాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!