హైదరాబాద్‌లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పక్కనే ఉన్న కైత్లాపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా.. ’33 ఏళ్ళు సినీ రంగంలో ప్రఖ్యాతిగాంచారు. నీతికి, నిజాయితీకి మారు పేరు ఎన్టీఆర్. రాజకీయాల్లో సమయ పాలన ఉండదు. రాజకీయాల్లో క్రమ శిక్షణ తెచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. అధికార వికేంద్రీకరణ చేశారు. పేదవాడికి ఇల్లు లక్ష్యంగా పని చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానప్పటి వరకు మదరాసీలు అనే వారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పారు. శత్రుత్వం పనికి రాదు, సరైంది కాదు. రాజకీయాల్లో శత్రుత్వం రూపుమాపి స్నేహపూర్వక రాజకీయాలు చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Sonia Gandhi: కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించారు..
అనంతరం ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి మాట్లాడుతూ.. ‘భావి తరాలకు ఎన్టీఆర్ ఔచిత్యం గురించి తెలియజేయాల్సిన భాద్యత అందరిపై ఉంది. ఏఎన్నార్ ను మేము బాబాయ్ అనే వాళ్ళం. ఏఎన్నార్ కు పిల్ల నివ్వడానికి కూడా వెనుకడుగు వేసే వారని ఏఎన్నార్ చాలా సార్లు చెప్పే వారు. నటి, నటులకు ఎంతో గుర్తింపు తెచ్చిన వ్యక్తులు ఎన్టీఆర్, ఏఎన్నార్. పదవి అలంకార ప్రాయం కాదు.. ప్రజలకు సేవడానికే అని నిరూపించారు ఎన్టీఆర్. పాలకుడు ప్రజలకు నచ్చిన పనులు చేయాలి తనకు నచ్చిన పనులు చేయడం కాదని ఎన్టీఆర్ నిరూపించారు. అన్నా.. ఇంత చేసిన నీకు సభలు, సమావేశాలు నిర్బహించాలా అని అనిపిస్తుంది. శత తరాలకు ఎన్టీఆర్ గురించి తెలియాలి.’ అని అన్నారు.
Also Read : వెల్లుల్లితో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..