NTV Telugu Site icon

Banda Prakash : బీసీలకు రిజర్వేషన్లు లేవు.. బీసీల జనగణన చేపట్టాలి

Banda Prakash

Banda Prakash

పెద్దపల్లి జిల్లా మంథనిలో బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శాసనసమండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశంలో కేంద్రంలో అందరికీ శాఖలు ఉన్నాయిని, బీసీలకు ఒక శాఖ లేకపోవడం బాధాకరమన్నారు. 70 కోట్ల బీసీలకు కేవలం రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Ahiteja Bellamkonda: ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మిమ్మల్ని చూసే వాడే లేడిక్కడ

బీసీలకు రిజర్వేషన్లు లేవని, బీసీల జనగణన చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకపోవడంతో చాలాసార్లు తీర్పులు బీసీలకు వ్యతిరేకంగా వచ్చాయని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీసీల లెక్కలు చేపట్టి వారికి స్వయం ఉపాధి కింద కులవృత్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిది సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు లక్ష 75 వేల కోట్లు, ఎస్సీలకు లక్ష కోట్లు, ఎస్టీలకు 75 వేల కోట్లు కేటాయింపు జరిగాయన్నారు. అనంతరం.. బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ మాట్లాడుతూ.. శ్యాం సింగరాయ్, ఆర్ ఆర్ ఆర్ గుర్తింపు వచ్చిన తెలుగు సినిమాలను చూపించకుండా కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీస్ లాంటి సినిమాలను ప్రచారం చేస్తున్నారన్నారు. బీపీ మండల్ ను గుర్తించి మంథనిలో విగ్రహం ఏర్పాటు చేసినందుకు బీసీల తరఫున మంథని ప్రజలకు, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : Kodanda Reddy : రాష్ట్రంలో వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది