Kuwait City : కువైట్ విద్యాశాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కువైట్ పాఠశాలల్లో మెటల్ ఫ్లాస్క్‌లను నిషేధించారు. ఈ మేరకు ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఓ పాఠశాలలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థి తన తోటి విద్యార్థిని మెటల్‌తో తయారు చేసిన ఫ్లాస్క్‌తో వేధిస్తున్నాడు. కువైట్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చవలసి వచ్చింది. ఈ ఘటన తర్వాత కొన్ని పాఠశాలల్లో అబ్బాయిలకు మాత్రమే మెటల్ ఫ్లాస్క్‌ల వాడకంపై నిషేధం విధించారు. కానీ ఇప్పుడు, విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, నిషేధం బాలలు, బాలికలు ఇద్దరికీ అన్ని పాఠశాలలకు వర్తిస్తుంది.