అంగరంగ వైభవంగా కొనసాగిన గణేష్ ఉత్సవాలు నిమజ్జనం దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పలువురు భక్తులు విఘ్నేషుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. అయితే నిమజ్జన సమయంలో వినాయకుడి ఫొటోలు, వీడియోలు తీయడం.. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇలాంటి వారికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. గణేష్ విగ్రహ నిమజ్జనం ఫోటోలు, వీడియోలు తీయడం, షేర్ చేయడంపై నిషేధం విధించారు. అయితే ఇది తెలంగాణలో కాదు మహారాష్ట్రలో. పూణే పోలీసులు గురువారం ఒక ఉత్తర్వులను జారీ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 15 మధ్య నిమజ్జనం చేయనున్న గణేష్ విగ్రహాల చిత్రాలు, వీడియోలను చిత్రీకరించడం, ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూన్నట్లు తెలిపారు.
Also Read:Trump Tariffs: భారత్ కు సహకరించకపోతే మనకు నష్టాలు తప్పవు.. ట్రంప్‌ను హెచ్చరించన ఫిన్లాండ్
ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ (BNSS) సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వు జారీ చేయబడిందని ఒక పోలీసు అధికారి వార్తా సంస్థకు తెలిపారు. పూణేలో విగ్రహాల నిమజ్జనం శనివారం జరుగుతుంది. “సహజ జల వనరులలో లేదా కృత్రిమ ట్యాంకులలో నిమజ్జనం చేస్తున్న గణపతి విగ్రహాల దృశ్యాలను చిత్రీకరించడం, వ్యాప్తి చేయడం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుంది. ప్రజా శాంతికి భంగం కలిగిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై భారత శిక్షాస్మృతి (BNS)లోని సంబంధిత విభాగాల కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.