Site icon NTV Telugu

BLA: 39 ప్రాంతాల్లో పాక్ ఆర్మీపై బలూచిస్థాన్ దాడులు.. మరో పట్టణం స్వాధీనం!

Balochistan1

Balochistan1

దేశం నుంచి తాము విడిపోతామని, స్వాతంత్రం కావాలంటూ బలూచిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌తో పోరాడుతున్నారు. ఓవైపు భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థలు పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. ఇలా ఇరువైపుల నుంచి తమపై దాడి జరుగుతుండగా.. పాక్ అల్లాడిపోతుంది. అయితే ఇదే సరైన సమయం అని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ భావిస్తోంది. బలూచిస్థాన్ ఇప్పటికే కీలక నగరం క్వెట్టా సహా చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి పాక్ ఆర్మీని తరిమికొట్టినట్లు ఇటీవల పేర్కొంది. తాజాగా మరో బలూచీ మరో కీలక ప్రకటన చేసింది. బలోచిస్థాన్‌ వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశామని వెల్లడించింది.

READ MORE: IND PAK War: ఇక దబిడి దిబిడే.. ఏ ఉగ్రదాడి జరిగినా యుద్దంగానే పరిగణిస్తాం..!

బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో గల కాలత్‌ జిల్లా మంగోచర్‌ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) శనివారం ప్రకటించింది. ఈ ఆపరేషన్‌ ఇలాగే కొనసాగుతోందని స్పష్టం చేసింది. మిలిటరీ కాన్వాయ్‌లపై దాడులు చేస్తామని హెచ్చరించింది. స్థానికంగా ఉన్న పలువురు పోలీసులను బందీలుగా తీసుకున్నామని ప్రకటనలో పేర్కొంది. పోలీసు స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. రహదారులను సైతం దిగ్బంధించి పాకిస్థాన్‌కు కుంపటిలా మారింది. ఇటు భారత సైన్యం, అటు బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ మధ్య శత్రుదేశం పాకిస్థాన్ నలిగిపోతోంది. ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లుతోంది. రాజీకి సిద్ధమంటూ ప్రభుత్వంలోని కీలక మంత్రులు ఇప్పటికే క్లారిటీ ఇస్తున్నారు.

READ MORE: Khawaja Asif: భారత్‌పై పాకిస్థాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా? పాక్ రక్షణ మంత్రి క్లారిటీ..

Exit mobile version