Balmuri Venkat : బీఆర్‌ఎస్ కి చెందిన ఓ ఆంబోతు ఏది పడితే అది మాట్లాడుతున్నాడంటూ ఎమ్మె్ల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు గుప్పించారు. కొకైన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరు.? పార్టీలో ఏం జరిగింది అనేది పక్కదారి పట్టిస్తున్నారని, 10 యేళ్ల నుండి కేటీఆర్ సన్నిహితులు డ్రగ్స్ వాడుతుంటారు కాబట్టి.. ఆయనకు కూడా అలవాటు ఉందని ఆరోపణలు వచ్చాయన్నారు. విజయ్ మద్దూరు చానా దగ్గర వ్యక్తులు అని కేటీఆర్ అంటున్నాడని, నీ సన్నిహితులు కొకైన్ తీసుకుంటే దాని మీద మాట్లాడకుండా.. దారి తప్పిస్తున్నాడంటూ బల్మూరి వెంకట్ ఆరోపించారు. పాడి కౌశిక్ ది..నా స్థాయి కూడా కాదని, నా మీద 88 కేసులు ఉన్నాయి.. దొరలపై కొట్లాడితే కేసులు పెట్టారన్నారు, పాడి కౌశిక్ చరిత్ర ఏముంది..? ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడిగా పరిచయం ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ మోసం చేసి.. బీఆర్‌ఎస్‌లో చేరావని ఆయన వ్యాఖ్యానించారు.
Mustard Benefits: ఆవాలుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలనుకున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ వరంగల్ వస్తే… కార్యకర్తలను రాళ్ళతో కొట్టిన చరిత్ర నిది అని, రేవంత్ రెడ్డి తో పోల్చుకునే స్థాయా నీది కౌశిక్ అంటూ ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారని, నేను మొదలుపెడితే ఒక్కొక్కడి జీవితం అంతా సోషల్ మీడియా లో పెడతామని ఆయన అన్నారు. వారానికో నేత జీవితం బయట పెడతా అంటూ నిప్పులు చెరిగారు బల్మూరి వెంకట్. మా ఎంపీ అనిల్ అన్నకు విజ్ఞప్తి.. కౌశిక్ రెడ్డి నీ ఏదో ఒక సదర్ లో షో చేయించండి అని.. ఆంబోతు లెక్క బయట తిరుగుతున్నాడు అని బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు.