బీజేపీ, కాంగ్రెస్ లు దద్దమ్మ పార్టీ లే అని, దేశంను ముంచిన పార్టీలు అంటూ ధ్వజమెత్తారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌లు దేశ ప్రజలను వంచించిన పార్టీలేనని ఆయన మండిపడ్డారు. మనం బాగుంటేనే కాదు దేశం బాగుండాలని ఆయన వ్యాఖ్యానించారు. 24 గంటల కరెంట్, తెలంగాణ పథకాలు దేశం మొత్తం రావాలే అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఆగకుండా జరగాలంటే పథకాలు అమలు కావాలంటే మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని, కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మి తప్పిదారి ఓట్లు వేస్తే కర్ణాటక పరిస్థితి వస్తుందన్నారు.
Also Read: Balakrishna: దటీజ్ బాలయ్య.. జగపతిబాబు కోసం వెంటనే ఒప్పేసుకున్నాడట!
కర్ణాటకలో ఓట్లు వేసే అంతసేపు అన్ని ఫ్రీ అన్నారు.. ఇప్పుడు ఏ ఒకటి అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలు కావాలన్నారు బాల్క సుమన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఎంతో భరోసాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చారని తెలిపారు. ప్రతి పేదింటి మహిళకు అండగా ఉంటూ, గత ప్రభుత్వాలు చేయలేని మరెన్నో సేవా పథకాలు కొనసాగిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు.
Also Read : Himachal Pradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. నలుగురు మృతి..