NTV Telugu Site icon

Balineni Srinivas Reddy: మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికలపై బాలినేని క్లారిటీ!

Balineni

Balineni

Balineni Srinivas Reddy: మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికలపై జరగుతున్న ప్రచారాలు మీడియా సృష్టి తప్ప ఏమీ లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ తెచ్చుకోవాలనుకుంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప అందరూ వస్తారని ఆయన అన్నారు. టీడీపీతో 45 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే ఇద్దరినే ఎందుకు కొనుక్కున్నారని ఆయన ఎద్దేవా చేశారు. డబ్బులు ఇచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. హైప్ చేసుకోవటం తప్ప ప్రచారంలో నిజం ఏమీ లేదన్నారు.

Read Also: malladi vishnu: మంత్రివర్గ విస్తరణ నిర్ణయం ఆయనకు మాత్రమే తెలుసు…

సీఎం జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యేలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పుల పాలైందని చంద్రబాబు అంటున్నారని.. గత ప్రభుత్వ హాయంలో ఉన్న అప్పులు ఎంత.. ఇప్పుడు తీసుకున్న అప్పులు ఎంతో చంద్రబాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హాయాంలో తెచ్చిన అప్పులు దేని కోసం ఖర్చుపెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే ప్రజల దగ్గరకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నామన్నారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా ఎన్నో కుయుక్తులు పన్ని కోర్టులకు వెళ్తున్నారని ఆయన మండిపడ్డారు.