Site icon NTV Telugu

Balayya : డాన్ గా బాలయ్య.. సోలో రిలీజ్ కోసం ప్లానింగ్

Nbk 111

Nbk 111

నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు రాబోతున్న కొత్త చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని తొలుత ఒక భారీ చారిత్రక కథను సిద్ధం చేసుకున్నాడు.

Also Read : Viroshi : విజయ్ దేవర కొండ – రష్మిక రిషెప్షన్ ఎప్పుడంటే

కానీ, ఆ కథకు అయ్యే భారీ బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే పవర్ ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేశారు. లేటెస్ట్‌గా ఈ సినిమా ముంబయి నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. బాలయ్యను చాలా స్టైలిష్‌గా, మునుపెన్నడూ చూడని మాస్ యాక్షన్ అవతార్‌లో గోపీచంద్ చూపించబోతున్నారట. అయితే.. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేయడం లేదట. సింగిల్ రోల్ అయినప్పటికీ, ఆ పాత్రలో ఉండే ఇంటెన్సిటీ మరియు డైలాగ్ పవర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకుని, మార్చి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనున్న సినిమాని త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంది. అలాగైతే సోలో రిలీజ్ దొరుకుతుంది.

Exit mobile version