Balapur Ganesh Laddu Auction 2025: బాలాపూర్ లడ్డూ కోసం ఫుల్ డిమాండ్.. వీరి మధ్యే పోటీ
- బాలాపూర్ లడ్డూ వేలంపై భక్తుల ఆసక్తి..
- ఈ సారి లడ్డూ వేలం కోసం ఏడుగురి మధ్య పోటీ..
- ఫైనల్ లిస్ట్ ప్రకటించిన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balapur Ganesh Laddu Auction 2025: గణేష్ లడ్డూ వేలం పాట అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణనాథుడే.. ఎందుకంటే.. బాలాపూర్ గణపతి దగ్గర లడ్డూ వేలం పాట ప్రారంభమైంది.. ఇది క్రమంగా.. అంతటా విస్తరించింది.. బాలాపూర్‌లో 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది పెరుగుతూ వచ్చింది.. 2023లో రూ.27 లక్షలు పలకగా.. 2024లో రూ.30.01 లక్షలకు చేరి తన రికార్డును తానే అధిగమించాడు బాలాపూర్ గణపయ్య.. 2024లో బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి ఈ లడ్డూను గెలుచుకున్నారు. బాలాపూర్ లడ్డూను దక్కించుకుంటే సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.. అందుకే ప్రతీఏడాది లడ్డూ వేలం కోసం పోటీ పడుతుంటారు భక్తులు.. అయితే, బాలాపూర్ గణపతి లడ్డూ వేలంకి ఓ ప్రత్యేకత ఉంటుంది.. గత ఏడాది యాక్షన్‌లో పలికిన లడ్డూ ధరను ముందుగా డిపాజిట్ చేసినవారికే ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది..
Read Also: Khairatabad Ganesh Nimajjanam: కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
Also Read
- Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
- 7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
కాగా, 1994లో మొదటిసారి లడ్డూ వేలంలో రూ.450కి కొలన్ మోహన్‌రెడ్డి దక్కించుకున్నారు. ఇప్పటివరకు 30 సార్లు వేలం నిర్వహించింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి.. అయితే, 2020లో కరోనా కారణంగా వేలం లేకుండానే అప్పటి సీఎం కేసీఆర్ కు అందజేశారు. ఇక ప్రతీ ఏడాది లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది.. రూ.1116తో మొదలయ్యే పాట మెల్లి మెల్లిగా లక్షలకు చేరుకుంటుంది. వేలంలో పాల్గొనేందుకు బాలాపూర్ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారూ వస్తుంటారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి రూల్స్ ప్రకారం.. ముందుగా డబ్బులు డిపాట్ చేసినవారికే యాక్షన్‌లో పాల్గొనే అవకాశం ఉండగా.. ఈ సారి బరిలో నిలిచారు ఏడుగురు.. వారి పేర్లను బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది..
ఈ సారి లడ్డూ యాక్షన్‌లో ఉన్నవారు వీరే..
1. మర్రి రవికిరణ్ రెడ్డి (చంపాపేట్),
2. అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి (ఎల్బీ నగర్)
3. లింగాల దశరథ్ గౌడ్ (కర్మాన్‌ఘాట్)
4. కంచర్ల శివారెడ్డి (కర్మాన్‌ఘాట్)
5. సామ రాంరెడ్డి (దయా).. కొత్తగూడెం, కందుకూరు
6. పీఎస్కే గ్రూప్ (హైదరాబాద్)
7. జిట్టా పద్మా సురేందర్‌రెడ్డి (చంపాపేట్)
తాజావార్తలు
-
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
-
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
-
Team India-BCCI: టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!