Site icon NTV Telugu

Balakrishna Birthday: కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

Balakrishna

Balakrishna

Balakrishna Birthday: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు , అభిమానుల మధ్య బాలయ్య తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యకు వేదపండితుల ఆశ్వీరచనాలు అందజేశారు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య హాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సొంతనియోజకవర్గంలో అభిమానుల వద్ద ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అభిమానులు కూడా తమ అభిమాన హీరో బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా పూజలు చేస్తున్నారు.

Read Also: AP Govt: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ యంత్రాంగం కదలిక..!

నందమూరి వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటసింహంగా బాలకృష్ణ గుర్తింపు సాధించుకున్నారు. ఆయనను అభిమానులంతా ప్రేమగా బాలయ్య, ఎన్‌బీకే అని పిలుచుకుంటారు. ఒకవైపు హీరోగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాలను చూశారు బాలకృష్ణ. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ ఏడాది బాలయ్యకు ఎంతో ప్రత్యేకం. ఆయన సిని ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. పైగా.. తాజాగా ఎన్నికల్లో ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందంలో ఉన్నారు. ఈ సారి మంత్రి పదవి కూడా దక్కవచ్చని ప్రచారం సాగుతోంది.

Exit mobile version