NTV Telugu Site icon

Ambedkar Konaseema: బడుగువానిలంకకు పొంచి ఉన్న వరద ముప్పు..

Varadalu

Varadalu

వరద గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో వరదనీటి ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పూర్తి గోదావరి నది మధ్యలో ఉండే ఆ బడుగువానిలంక గ్రామానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Gujarat: పెళ్లైన ఏడాదికి బయటపడ్డ భార్య సీక్రెట్.. డాక్టర్ వద్దకు వెళ్లడంతో తెలిసిన నిజం..

ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే రోడ్లు మునిగిపోయి రాకపోకలు నిలిచిపోతాయి. అందుకే ఆరు మరబోట్లను సిద్ధం చేశారు. అలాగే 50 లైఫ్ జాకెట్లు, బియ్యం, మంచినీళ్లు ప్యాకెట్లు,నిత్యావసర సరకులను ఏర్పాటు చేస్తున్నారు. మరింత వరద నీరు చేరితే ఆ ఊరిలో ఉండే 1,114 కుటుంబాలకు చెందిన సుమారు 3,600 మంది ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు రెవెన్యూ అధికారుల ఆద్వర్యంలో చర్యలు చేపడుతున్నారు.రోడ్డుపైకి నీరు అధికంగా చేరుతున్నందున రోడ్డుకు ఇరువైపులా కర్రలు, తాళ్లు కట్టి ప్రమాద హెచ్చరిక ఎర్ర జెండాలు ఏర్పాటు చేసారు. అలాగే ఆ గ్రామంలో వారికి పునరావాస కేంద్రంగా చెముడులంక శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపాన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా గత వారం రోజులుగా గ్రామంలో చొప్పెల్ల పిహెసి ఆద్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.

Ministry of Finance: విదేశాలకు వెళ్లాలంటే ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ అవసరమా..?

వరద ప్రమాద హెచ్చరికల అధికారులు సూచనల ప్రకారం ఇక్కడ పునరావాస ఏర్పాట్లు చేపడుతామని ఆలమూరు తాసిల్దార్ డి.వి.ఎన్ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన గ్రామంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ గోదావరి పరిహార ప్రాంతాలకు రానీయకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.