‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”..ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి మరియు గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో హాట్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది.ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ “లంకల రత్న” అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ‘సుట్టంలా సూసి’ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్ లో నేహా శెట్టి ,విశ్వక్ సేన్ క్యూట్ స్టెప్స్ తో అదరగొట్టారు.ఆ తరువాత రిలీజ్ చేసిన “మోత” గీతం మాస్ ప్రేక్షకులని ఊపేస్తోంది.ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి ‘బ్యాడ్’ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేసారు.ఈ పాటను యువన్ శంకర్ రాజా అద్భుతంగా కంపోజ్ చేసారు.ఈ “బ్యాడ్” థీమ్ సాంగ్ ఈ మూవీలోని చీకటి ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ సాగుతుంది.ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి అద్భుతమైన సాహిత్యం అందించారు.ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ సినిమా మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
.