NTV Telugu Site icon

Sri Lanka: శ్రీలంక క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్.. వరల్డ్ కప్కు ఆ స్టార్ ప్లేయర్ దూరం..!

Hasaranga

Hasaranga

శ్రీలంక క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్.. వరల్డ్ కప్ కు ఆ స్టార్ ప్లేయర్ దూరం కానున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా.. శ్రీలంక మెయిన్ స్పిన్నర్ వనిందు హసరంగా. అతని గాయంపై మెడికల్ ప్యానెల్ హెడ్ అర్జున డి సిల్వా అప్‌డేట్ ఇచ్చాడు. రాబోయే వన్డే ప్రపంచకప్ లో హసరంగా దూరమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా.. శస్త్రచికిత్స కోసం టీమ్ మేనేజ్‌మెంట్ విదేశీ వైద్యులను సంప్రదిస్తోందని తెలిపాడు. శస్త్ర చికిత్స చేసిన తర్వాత కనీసం 3 నెలల విశ్రాంతి తనకు అవసరమన్నాడు.

Read Also: Pooja Hegde: క్రికెటర్ ప్రేమలో పూజా.. మరి ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి.. ?

టీమ్ కు కీలక ఆటగాడిగా భావించే మేము.. ముందు ఆడబోయే మ్యాచ్ ల కోసం వేచి చూస్తున్నామని డి సిల్వా చెప్పాడు. మరోవైపు వరల్డ్ కప్ లో భాగంగా.. అక్టోబర్ 7న దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు హసరంగా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి. కాని అతను గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జట్టులోకి రైట్ ఆర్మ్ స్పిన్నర్‌ను తీసుకోవడానికి సెలక్టర్లు వెతికే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే.. లంక ప్రీమియర్ లీగ్‌లో గత నెలలో జరిగిన ప్లేఆఫ్‌ల సమయంలో హసరంగా మోకాలికి గాయమైంది. దీంతో అప్పటినుంచి గాయం కారణంగా ఏ మ్యాచ్ ల్లో ఆడలేదు.

Read Also: 2000 Notes Exchange: 2000 నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే సమయం.. త్వరగా మార్చుకోండి

హసరంగ టీ20 ప్రపంచ కప్ లో ఇటీవలి రెండు ఎడిషన్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో జింబాబ్వేలో జరిగిన ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో వికెట్ చార్టులలో అగ్రస్థానంలో ఉన్నాడు.