NTV Telugu Site icon

Pakistan: కమ్రాన్ గులామ్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ.. బాబర్ అజామ్ పై ట్రోల్స్

Kamran Ghulam

Kamran Ghulam

ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2024 అక్టోబర్ 10న అతనికి 29 ఏళ్లు నిండాయి. కాగా.. గులామ్ తన అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 13వ పాక్‌ క్రికెటర్‌గా నిలిచాడు. అయితే.. అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద పాకిస్థానీగా గులామ్ ఉన్నాడు. అబిద్ అలీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అబిద్ అలీ 2019 డిసెంబర్ 15న రావల్పిండిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పటికి అతని వయసు 32 ఏళ్ల 2 నెలలు. కమ్రాన్ గులామ్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. కమ్రాన్ గులామ్ తన ఇన్నింగ్స్‌లో 224 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 118 పరుగులు చేశాడు.

Rain Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం

కమ్రాన్ గులామ్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో (16 ఫస్ట్‌క్లాస్ సెంచరీలు) తన సత్తాను నిరూపించుకున్నాడు. ఈ సెంచరీ తర్వాత, సోషల్ మీడియా వినియోగదారులు గులామ్‌ను ప్రశంసిస్తున్నారు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. బాబర్ ఆజం తనకు వచ్చిన అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ క్రికెట్‌లోని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్‌లలో ఒకరైన బాబర్ ఆజం స్థానంలో ఎంపికైన కమ్రాన్ గులామ్ వచ్చిన వెంటనే సెంచరీ సాధించాడు. దీంతో సెలక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.’ అని తెలిపారు.

Hoax bomb threats: ఢిల్లీ-చికాగో ఎయిరిండియాతో సహా 5 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు..

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ని రెండో, మూడో టెస్టు మ్యాచ్‌ల జట్టు నుంచి తప్పించారు. బాబర్ ఆజం గత రెండేళ్లలో టెస్టు క్రికెట్‌లో ఒక్క సెంచరీ, అర్ధ సెంచరీ కూడా సాధించలేదు. కాగా.. రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 5 వికెట్లకు 259 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 37 పరుగులతో, సల్మాన్ అఘా 5 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం కమ్రాన్ గులామ్ మాట్లాడుతూ.. ‘దేశవాళీ క్రికెట్‌లో నేను చాలా కష్టపడ్డాను. నాకు అవకాశం అంత తేలికగా రాలేదు. ఈ రోజు నేను బాబర్ ఆజం లాంటి లెజెండ్‌ని భర్తీ చేశాను. ఇంత మంచి ఆటగాడిని భర్తీ చేసినప్పుడు, నేను మంచి ప్రదర్శన చేయాలని అనుకున్నాను.’ అని కమ్రాన్ గులామ్ తెలిపాడు.