Kattappa : ఖల్ నాయక్ మిస్ చేసుకున్న కట్టప్ప క్యారెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kattappa : బాహుబలి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకుల చూపును తెలుగు ఇండస్ట్రీ వైపు తిప్పిన సినిమా బాహుబలి. ఈ సినిమాను రాజమౌళి రెండు భాగాలుగా తెరకేక్కించారు. ఈ రెండు భాగాల మధ్య ఒక ట్విస్టు పెట్టాడు. బాహుబలికి వెన్నంటే మేనమామలా ఉన్న కట్టప్ప అతడిని చంపడంతో మొదటిభాగం ముగుస్తుంది. ఇక రెండో భాగంలో ఎందుకు అలా చంపాల్సి వచ్చింది అనేది వివరంగా చూపించారు. ఈ సినిమాలో బాహుబలి గా ప్రభాస్.. బళ్లాలదేవుడిగా రానా ఇక కీలక పాత్రల్లో అనుష్క, రమ్యకృష్ణ, తమన్న నటించారు. రెండు భాగాల్లో కట్టప్ప క్యారెక్టర్ సినిమాకు కీలకం.
Read Also: Guess Who: బ్యాక్ చూపిస్తూ రెచ్చగొడుతున్న ఈ ముద్దుగుమ్మలు ఎవరో గుర్తుపట్టండి.. చూద్దాం
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ఈ పాత్రను తమిళ నటుడు సత్యరాజ్ పోషించారు. అప్పట్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత కట్టప్ప క్యారెక్టర్ సత్యరాజ్ తప్ప ఇంకెవరు న్యాయం చేసేవారు కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మాస్టర్ మైండ్ రాజమౌళి మాత్రం కట్టప్ప క్యారెక్టర్ కోసం ముందుగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోని అడిగాడట. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ ఖల్నాయక్ సంజయ్ దత్. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే నటుడు సంజయ్. ఈ క్రమంలోనే కట్టప్ప పాత్రకు సంజయ్ దత్ అయితే బాగుంటుందని రాజమౌళి భావించాడట. ఈ క్రమంలోనే సంప్రదింపులు కూడా జరిపాడట. అయితే స్క్రిప్ట్ విన్న సంజయ్ దత్ కట్టప్ప పాత్ర అంత బలంగా లేదని అనుకున్నాడట. దీంతో రాజమౌళికి నో చెప్పేసాడట. ఆ తర్వాత కట్టప్ప పాత్ర చివరికి సత్యరాజ్ కు దక్కింది. ఇక సత్యరాజ్ కెరియర్ లోనే ఈ పాత్ర ఒక మైల్ స్టోన్ గా నిలిచింది అని చెప్పాలి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ ఈ విషయాన్ని వెల్లడించాడు. కేజీఎఫ్ సినిమాలో అధీర పాత్రలో నటించిన సంజయ్ దత్ ప్రేక్షకులను అలరించాడు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!