కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇటీవలే “అయలాన్”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన శివకార్తికేయన్ ఆ మూవీస్ కి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ అందిస్తూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాడు.శివకార్తికేయన్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ “sk23”. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో పాపులర్ మలయాళ నటుడు, అయ్యప్పనుమ్ కొషియుమ్ ఫేం బిజూమీనన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.తాజాగా దీనిపై అధికారిక అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో వస్తున్నమూవీలో తాను నటిస్తున్నట్లు బిజుమీనన్ తెలిపారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని దీని కోసం తాను ఏకంగా ఏడాది పాటు డేట్స్ ఇచ్చినట్లు తెలిపారు.2010లో తమిళ చిత్రంలో నటించిన బిజుమీనన్..మళ్లీ ఇన్నాళ్లకు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది.అలాగే ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ శివకార్తికేయన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ కూడా మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .శివకార్తికేయన్ నటిస్తున్న “ఎస్‌కే 21″లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.అలాగే విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.