NTV Telugu Site icon

AP Assembly: నేడు స్పీకర్‌ ఎన్నికపై సభలో అధికారిక ప్రకటన.. దూరంగా వైసీపీ..!

Ap Speaker

Ap Speaker

AP Assembly: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఈ రోజు ఆయన శాసన సభలో బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇవాళ రెండో రోజు ఉదయం పదిన్నరకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. నిన్న ప్రమాణం చేయని వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇక, ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్య చౌదరి ప్రకటిస్తారు.. ఆ తర్వాత స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు అయ్యన్నపాత్రుడు. సభాపతి ఎన్నిక ప్రకటన తర్వాత.. అయ్యన్నను గౌరవప్రదంగా స్పీకర్‌చైర్‌లో కుర్చొబెట్టనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి ఎమ్మెల్యేలు.. అయితే, స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్లనున్నారు.

Read Also: Govinda Namalu: గోవింద నామాలు

మరోవైపు.. స్పీకర్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు తొలి ప్రసంగం చేయనున్నారు.. సీఎం ప్రసంగాన్ని బలపరుస్తూ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రసంగాలు ఉండనున్నారు.. ఆ తర్వాత ప్రసంగాలకు సమాధానం ఇవ్వనున్నారు కొత్త స్పీకర్‌. ఇక, స్పీకర్ సమాధానం తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడనుంది.. కాగా, స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం శుక్రవారం రోజు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగగా.. టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రమే నామినేషన్ వేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు.. గడువులోగా మరో నామినేషన్‌ దాఖలు కాకపోవడంతో.. అయ్యన్నపాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం అని అధికారులు ప్రకటించారు.