Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
- రంజీ ట్రోఫీలో ఆయుష్ బదోని వరుసగా రెండో డబుల్ సెంచరీ
- జార్ఖండ్‌పై 228 బంతుల్లో 210 పరుగులతో అజేయంగా..
- అంతకుముందు గుజరాత్‌పై 217 పరుగులు
- వరుస రెండు ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీలు
- విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ సరసన చోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayush Badoni: రంజీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని పరుగుల వరద పారిస్తున్నాడు. గుజరాత్‌పై డబుల్ సెంచరీతో అదరగొట్టిన బదోని.. తాజాగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ మరో ద్విశతకం బాదాడు. దీంతో వరుసగా రెండు ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన అరుదైన భారత బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు.
రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బదోని ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. కేవలం 216 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. చివరకు 228 బంతుల్లో 210 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బదోని మెరుపు ఇన్నింగ్స్‌తో ఢిల్లీ భారీగా 515 పరుగులు చేసింది. ఇదే రంజీ సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బడోని 217 పరుగులు చేశాడు. ఇప్పుడు జార్ఖండ్‌పై 210 నాటౌట్‌తో మరో ద్విశతకం సాధించాడు. అంతకుముందు సీజన్ తొలి మ్యాచ్‌లో 23, 85 పరుగులు చేసిన బదోని.. ఆ తర్వాత వరుసగా 217, 210 పరుగులతో సంచలన ఫామ్‌లోకి వచ్చాడు.
Also Read
- IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
- CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
- UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
- Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
వరుసగా రెండు ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించడంతో బదోని భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ సరసన చేరాడు. ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్లలో బదోని 21వ ఆటగాడిగా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించడం అత్యంత అరుదైన రికార్డు కాగా.. వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన బ్యాటర్ ఇప్పటివరకు లేడు. ఈ అరుదైన జాబితాలో కేఎస్ రంజిత్సింహ్జీ, నవాబ్ పటౌడీ, విజయ్ మర్చంట్, రూసీ మోదీ, దిలీప్ వెంగ్‌సర్కార్, అరుణ్ లాల్, డబ్ల్యూవీ రామన్, వినోద్ కాంబ్లీ, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, మిలింద్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, ఎన్. జగదీశన్, అగ్ని చోప్రా, స్నేహల్ కౌతంకర్ వంటి పలువురు దిగ్గజాలు ఉన్నారు.
టీ20 క్రికెట్లో ఎక్కువగా కనిపించే ఆయుష్ బదోని.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం మరింత అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 27 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 63.84 సగటుతో 2,426 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు డబుల్ సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా వరుస డబుల్ సెంచరీలతో తన ఫస్ట్‌క్లాస్ సత్తాను మరోసారి చాటుకున్నాడు. ఇంతటి ప్రతిభ ఉన్నప్పటికీ బడోనికి ఇప్పటివరకు ఇండియా-A జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్‌లోనూ అతడికి అవకాశం రాలేదు.
తాజావార్తలు
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!