కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అయలాన్ మూవీ తమిళ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే తెలుగులో సంక్రాంతి పండుగ సందర్బంగా గుంటూరు కారం, సైంధవ్ మరియు నా సామిరంగతో పాటు హనుమాన్ రిలీజ్ కావడంతో అయలాన్ మూవీకి థియేటర్లు దొరకలేదు దాంతో తెలుగు వెర్షన్‌ను రెండు వారాలు ఆలస్యంగా జనవరి 26న రిలీజ్ చేయాలని భావించారు. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఈ ప్రమోషన్స్‌లో శివకార్తికేయన్ కూడా పాల్గొన్నాడు.అయితే లీగల్ సమస్యలు తలెత్తడంతో జనవరి 26న థియేటర్లలో ఈ మూవీ విడుదలకాలేదు. బుకింగ్స్ బాగానే జరిగినా స్క్రీనింగ్‌కు అవకాశం లేకపోవడంతో ఆ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరి 2లోగా లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. అప్పటిలోగా కూడా సమస్యలు కొలిక్కి రాకపోతే తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తుంది..దీనితో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
అయితే అయాలాన్ మూవీ థియేటర్లలో విడుదలైన పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కు రానుంది.ఈ సినిమా స్ట్రీమింగ్‌ను శనివారం సన్ సెక్స్ట్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదిని ప్రకటించలేదు.అయితే ఫిబ్రవరి 9 నుంచి ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీటీలో విడుదలకానున్నట్లు తెలుస్తుంది.. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాలం మరియు కన్నడంతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.అయలాన్ తమిళ వెర్షన్ థియేటర్లలో రిలీజైన నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతుండటం ఆసక్తికరంగా మారింది. అయలాన్ మూవీ 15 రోజుల్లో అరవై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతికి రిలీజైన తమిళ సినిమాల్లో కెప్టెన్ మిల్లర్ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా అయలాన్ మూవీ నిలిచింది.
#Ayalaan is all set to land worldwide exclusively on #SunNXT 👽
Wait for the updates 😉@Siva_Kartikeyan @Rakulpreet @Ravikumar_Dir @arrahman#SivaKarthikeyan #ARRahman #SunNXTExclusiveAyalaan pic.twitter.com/tRPGrNUW2K— SUN NXT (@sunnxt) January 27, 2024