Operation Sindoor : పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ vs పాక్ ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఆకాశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన అత్యంత కీలక ఎయిర్ వార్నింగ్ వ్యవస్థ అయిన AWACS విమానం భారత వైమానిక దళం చర్యతో కూలిపోయింది. ఇది కేవలం ఓ విమానం నష్టం కాదు, దాయాది దేశానికి వ్యూహాత్మకంగా చెమటలు పట్టించే పరిణామం. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిగాయి. పాక్ తట్టుకోలేక, ప్రతీకార యత్నంగా భారత సరిహద్దుల వెంట ఉన్న 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని, రాత్రివేళ దాడి కోసం ‘AWACS’ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. ఇది శత్రుదేశంలో రహస్యంగా విమాన చలనాలను గుర్తించడానికి ఉపయోగపడే ప్రధాన హథియార్. కానీ… ఈసారి భారత వాయుసేన ముందే ప్లాన్‌తో రెడీగా ఉంది.
Pakistan: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. పైసల కోసం పాక్ ప్రయత్నాలు
భారత వైమానిక దళం మెరుపు వేగంతో స్పందించి, పంజాబ్ ప్రావిన్స్ గగనతలంలో పాక్ AWACS యూనిట్‌ను విజయవంతంగా లక్ష్యంగా చేసుకుని కూల్చివేసింది. ఇది పాక్‌కి అట్టడుగు నుంచి షేక్ ఇచ్చిన చర్యగా నిలిచింది. ఈ విమానం ఓ సాధారణ రాడార్ కాదు. ఇది శత్రు విమానాల కదలికల్ని నిఘా చేసి, నెట్‌వర్క్ ఆధారిత యుద్ధాల్లో కీలక సమాచారాన్ని పంపే ‘ఆకాశం మీద చలించే బ్రెయిన్’. అటువంటి వ్యవస్థ నాశనమవడం అంటే పాక్ వైమానిక వ్యూహం అర్థాంగంగా మిగిలిపోవడమే. ఈ పరిణామం తర్వాత కూడా శాంతించని భారత్, గురువారం రాత్రి ముగ్గురు కీలక వాయుసేన జెట్‌లను కూల్చేసింది. అందులో F-16, JF-17 యుద్ధ విమానాలతో పాటు, మరో అవాక్స్ సమ్మేళనం ఉన్నట్లు సమాచారం. సింగిల్ AWACS నష్టం అంటే పాక్‌కి డజను యుద్ధ విమానాలు కోల్పోయిన సమానమని మిలిటరీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
AWACS ఏమిటి? ఎందుకంత కీలకం..?
AWACS అంటే Airborne Warning and Control System. ఇది శత్రు గగన కదలికలపై నిఘా పెట్టే ‘ఎయిర్ బేస్డ్ కంట్రోల్ టవర్’. ఇది 400 కి.మీ. పరిధిలోని ఏరియాను స్కాన్ చేసి, సైనిక యాక్టివిటీ, డ్రోన్లు, మిసైల్ టార్గెట్లు వంటి వివరాలను కలెక్ట్ చేసి, కమాండ్ కేంద్రానికి ప్రసారం చేస్తుంది. దీనిని కూల్చడం అంటే ప్రత్యర్థి కళ్లను మూసేసినట్లే.. అయితే.. AWACS ధ్వంసంతో పాకిస్తాన్ షాక్‌లోకి వెళ్లింది. ఇప్పుడు ‘రక్షణ’ కంటే ముందు ‘గుర్తింపు’ దానికి ఓ సవాల్‌గా మారింది. ఇలాంటి అవాక్స్ విమానాలు పాక్ దగ్గర పరిమితి సంఖ్యలో ఉండటం.. ఒక అవాక్స్ విమానం పది యుద్ధవిమానాలతో సమానం కావడంతో పాక్ కు ఇది పెద్దదెబ్బే. ఈ పరిణామం తర్వాత పాకిస్తాన్‌లో ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఎయిర్ డిఫెన్స్ లోగానే ఇలా అయితే, భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న భయం మొదలైంది.
Bollywood : ఇండో-పాక్ వార్.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్న స్టార్ హీరో సినిమా
