Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- విమాన ఇంధనంలో ఇథనాల్ అంటూ ప్రచారం
- ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ఇంధనంలో ఇథనాల్‌ను కలపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్న ప్రచారాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పూర్తిగా ఖండించింది. ఈ తరహా వార్తలు పూర్తిగా అవాస్తవమని, బాధ్యతారాహిత్యంతో ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది.
కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. వాణిజ్య విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్ కలపాలనే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర అసలు లేదని స్పష్టం చేశారు. ‘‘విమాన ఇంధనంలో ఇథనాల్ కలపాలని ప్రభుత్వం యోచిస్తోందన్న ప్రచారం పూర్తిగా తప్పుడు, బాధ్యతారాహిత్యమైనది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు.’’ అని మంత్రి తెలిపారు. విమాన ఇంధనానికి ఇథనాల్‌ను అనుసంధానం చేస్తూ వస్తున్న ప్రచారాన్ని నిజమని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
Also Read
ఇథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) రెండూ ఒకటే కాదని మంత్రి స్పష్టం చేశారు. ఇవి పూర్తిగా వేర్వేరు ఇంధనాలేనని తెలిపారు. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విమాన ఇంధనమని, దీనికి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఆమోదం ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానయాన సంస్థలు, విమానయాన నియంత్రణ సంస్థలు ఇప్పటికే SAF వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని వివరించారు. ఇథనాల్‌కు భిన్నంగా SAF ప్రత్యేకంగా విమానాల కోసం అభివృద్ధి చేసిన ఇంధనమని, వాణిజ్య వినియోగానికి అనుమతి ఇచ్చే ముందు కఠినమైన పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
విమానాల్లో ఉపయోగించే ప్రతి ఇంధనం కఠినమైన అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి తెలిపారు. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ కూడా విస్తృత స్థాయి పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే వినియోగానికి అనుమతి పొందుతుందని చెప్పారు. విమాన భద్రత ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ప్రమాణాల ఆధారంగానే కొనసాగుతుందని, విమానయాన సంస్థలు ఉపయోగించే ఇంధనాలన్నీ ఆ ప్రమాణాలకు అనుగుణంగానే ఉండాలని స్పష్టం చేశారు.
విమాన భద్రతకు సంబంధించిన తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, అలాంటి అసత్య సమాచారం ప్రయాణికుల్లో అనవసర ఆందోళనకు కారణమవుతుందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రయాణికుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పునరుద్ఘాటించారు. విమాన ఇంధనానికి సంబంధించిన ప్రతి నిర్ణయం అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు, శాస్త్రీయ పరిశీలన ఆధారంగానే తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
-
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!