ఈ సంవత్సరం మొదటినుంచి మలయాళ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ లో ఉంది. ఈమధ్య కాలంలో విడుదలవుతున్న మలయాళ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా మిగతా భాషలో కూడా ఈ సినిమాలో డబ్బింగ్ జరుపుకొని అక్కడ కూడా విజయాన్ని సాధిస్తున్నాయి. ఇందులో భాగంగానే మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, బ్రహ్మయుగం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టాయి. ఇక ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాకు అయితే ఏకంగా 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టిందంటే ఎంత పెద్ద హిట్ సాధించిందో ఇట్టే అర్థమవుతుంది. ఇదే మాదిరిగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘ప్రేమలు’ సినిమా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Also Read: Thalaivar 171: రజనీకాంత్ సినిమాలో తెలుగు స్టార్ హీరో..?
ఇకపోతే తాజాగా మరో రెండు సినిమాల్లో కూడా ఈ వసూళ్ల లిస్టులో చేరిపోనున్నాయి. అందులో ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ సినిమా ఒకటి. మార్చి 11న విడుదలైన ఈ సినిమా కేరళలో వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఎనిమిది రోజుల్లోనే 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది. ఈ స్పీడు చూస్తుంటే వచ్చే వారంలో ఈ సినిమా కూడా 100 కోట్ల మార్కులు సులువుగా అందుకునేలా కనబడుతోంది. ఇదేగాని జరుగుతే హీరో కు మొదటి 100 కోట్ల సినిమా అవుతుంది.
Also Read: Iswarya Menon: శారీలో అందాలు ఆరబోస్తున్న ఐశ్వర్య మీనన్….
ఇక మలయాళంలో తెరకెక్కిన ‘వర్షంగాలక్కు శేషం’ అనే సినిమా కూడా థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. ఈ సినిమా కూడా కేరళలో కేవలం ఎనిమిది రోజుల్లో 21 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో ఆ సినిమాపై కూడా అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మలయాళ నేపథ్యం ఉన్న సినిమాలు భారతదేశం చిత్ర పరిశ్రమలలో హాట్ టాపిక్ సినిమాలుగా మారిపోయాయి.